సమయానికి ఆదుకున్నావు.. అమితాబ్ బచ్చన్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్..

by Anjali |   ( Updated:2023-05-15 09:05:59.0  )
సమయానికి ఆదుకున్నావు.. అమితాబ్ బచ్చన్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్..
X

దిశ, సినిమా: ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. ప్రజెంట్ హిందీలోనే కాకుండా తెలుగులోనూ పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కె’లో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే షూటింగ్ సెట్‏లో ఆయన కరెక్ట్ టైమ్‌కు వస్తాడన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ట్రాఫిక్ జామ్ కారణంగా షూటింగ్‍కు ఆలస్యం కావడంతో ఓ బైకర్ సాయం తీసుకుని, షూటింగ్‌కు చేరుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా బిగ్ బీ సోషల్ మీడియాలో తెలుపుతూ..‘నువ్వు ఎవరో నాకు తెలియదు మిత్రమా. కానీ నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. నా మాట మన్నించి, ట్రాఫిక్ నుంచి తప్పించి వేగంగా గమ్యస్థానానికి చేర్చావు. నీకు మరోసారి థాంక్స్’ అని పేర్కొన్నారు.

Read More: 23 ఏళ్ల తర్వాత తిరిగి బాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్న జ్యోతిక

Advertisement

Next Story