యాదమ్మ రాజు కాలి వేలు తీసేసిన డాక్టర్లు

by Anjali |   ( Updated:2023-08-02 09:14:36.0  )
యాదమ్మ రాజు కాలి వేలు తీసేసిన డాక్టర్లు
X

దిశ, సినిమా: జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు యాదమ్మ రాజు. అయితే రీసెంట్‌గా ఆస్పత్రిలో బెడ్‌పై ఉన్న ఆయన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన కాలుకు ఏమైందని రాజు ఫ్యాన్స్ ఆరా తీస్తున్నారు. కాగా ఆ విషయంపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అసలు తనకి ఎలా యాక్సిడెంట్ అయిందో చెప్పుకొచ్చాడు యాదమ్మ రాజు. ‘టీ తాగడానికి బయటకు వెళ్లాను. అప్పుడు నాకు ఎదురుగా వచ్చిన బండి కంట్రోల్ తప్పి నా కాలు మీద నుంచి వెళ్లడంతో ఈ గాయం అయింది. హాస్పిటల్ వెళ్తే కుడి కాలుకు ఉన్న ఒక వేలుని ఆపరేషన్ చేసి తీసేశారు. తొడ దగ్గర కొంచెం చర్మం తీసి అక్కడ వేశారు. కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు’ అని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

Advertisement

Next Story

Most Viewed