- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tunisha Sharma suicide case: నా కొడుకును ఆత్మహత్య చేసుకోమంటారా?తునీషా కేసుపై షీజన్ ఖాన్ తల్లి
దిశ , సినిమా : టెలివిజన్ నటి తునీషా శర్మ ఆత్మహత్యపై వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా తునీష తల్లి చేసిన వ్యాఖ్యలపై నటుడు షీజన్ ఖాన్ మదర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ కొడుకు గురించి వస్తున్న వార్తలన్నీ నిరాధారమైనవని, తునీష మానసిక స్థితిని ఆమె తల్లి పట్టించుకుంటే తను బతికేదని ఆరోపించింది. అంతేకాదు తునీషను హిజాబ్ ధరించమని ఎన్నడూ బలవంతం చేయలేదన్న ఆమె..ఒక మతాన్ని అనుసరించడం వ్యక్తిగత విషయమని, ఆమెను దర్గాకు తీసుకెళ్లామనే సాక్ష్యం ఉంటే చూపించమని సవాల్ చేసింది. ఇక సెట్‌లో తమ బిడ్డ తునీషను చిత్రహింసలకు గురిచేస్తుంటే..మీరు అక్కడ కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నారా? గతంలో ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదు? వెంటనే షీజన్‌పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మాకు చెప్పి ఉంటే షీజన్‌ను చెంపదెబ్బ కొట్టి మందలించేవాళ్లం కదా? అని ఫైర్ అయింది. అలాగే తమ కొడుకును ఎందుకు హింసిస్తున్నారన్న ఆమె..తునీష లాగే షీజన్ కూడా ఆత్మహత్య చేసుకోవాలని కోరుకుంటున్నారా? అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. చివరగా తునీషకు న్యాయం జరగాలని కోరుకోవడం విశేషం.
Also Read...
Anupama Parameswaran : అనుపమతో హీరో సంతోష్ శోభన్ వాట్సాప్ చాట్ లీక్..