Tabu: ఆ సినిమాకు ఓకే చెప్పినందుకు ఇప్పటికీ ఫీల్ అవుతున్నా.. టబు షాకింగ్ కామెంట్స్ వైరల్

by Kavitha |
Tabu: ఆ సినిమాకు ఓకే చెప్పినందుకు ఇప్పటికీ ఫీల్ అవుతున్నా.. టబు షాకింగ్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ టబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందంతో, నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. ఇప్పుడు సెకెండ్ ఇన్నింగ్స్‌లోను సత్తా చాటుకుంటుంది. కెరీర్ స్టార్టింగ్‌లో టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన హీరోయిన్‌గా జతకట్టిన నటి.. ఇప్పుడు కూడా హీరోయిన్‌గా నటిస్తూ తన గ్లామర్ ఏమాత్రం తగ్గలేదంటూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఇలా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటుంది టబు.

ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. నటి షబానా అజ్మీ నాకు బంధువు. ఆ క్లోజ్‌నెస్ వల్ల ఒకసారి నేను వాళ్ల ఇంటికి వెళ్లాను. అక్కడ డైరెక్టర్ శేఖర్ కపూర్ నన్ను చూశారు. చూసి నాతో ‘దుష్మణి’ అనే సినిమా చేయాలని ఉందని చెప్పారు. ఆ సమయంలో పదో తరగతి చదువుతున్న నేను.. నాకు చదువంటే ఇష్టం. సినిమా అంటే ఇంట్రెస్ట్ లేదని అతనికి చెప్పాను. కానీ ఆయన చాలాసార్లు అడగడంతో చివరకు నా టెన్త్ ఎగ్జామ్స్ పూర్తయ్యాక సినిమాకు సంతకం చేశాను. కానీ సడెన్‌గా ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ మూవీ ఆదిలోనే ఆగిపోయిందని టబు చెప్పుకొచ్చారు.

అయితే ఆ తర్వాత అదే మూవీ మనిషా కోయిరాలా, సన్నీ దేవోల్ ప్రధాన పాత్రల్లో బంటీ డైరెక్షన్‌లో తెరకెక్కిందని టబు అన్నారు. కొంతకాలం తర్వాత శేఖర్ కపూర్ మళ్లీ నన్ను కలిసి ‘ప్రేమ్’ మూవీలో నటించాలని అడిగాడు. ఆ సమయంలో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని అనుకున్నాను. కానీ శేఖర్ బలవంతం చేయడంతో ఆ సినిమాకు అంగీకరించి సంతకం చేశాను. అలా ఆ మూవీ షూటింగ్ మొదలైన తర్వాత శేఖర్ కపూర్ ఆ సినిమా నుంచి వైదొలిగారు. దీంతో ఆ ప్రాజెక్ట్ షూట్ ఐదేళ్ల జరిగింది.. దీంతో ఆ ప్రాజెక్ట్‌ ఓకే చెప్పినందుకు ఇప్పటికీ నేను చాలా బాధపడుతున్నానంటూ టబు చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed