ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈమె కెరీర్ లో హిట్ల కంటే ప్లాప్ లే ఎక్కువ..!

by Prasanna |
ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈమె కెరీర్ లో హిట్ల కంటే ప్లాప్ లే ఎక్కువ..!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలుతో ఫుల్ బిజీ అయింది. కానీ, ఈ మధ్య సినిమా అవకాశాలు లేక ఫోటో షూట్స్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. సినిమాలు చేసినా .. చేయకపోయినా.. ఆమె అభిమానులకు మాత్రం దగ్గరగా ఉంటుంది. ఒక లైలా కోసం మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే మనందరికీ సుపరిచితమే. కాకపోతే ఈమె కెరీర్ లో హిట్ల కంటే ప్లాప్ లే ఎక్కువ ఉన్నాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన " అల వైకుంఠపురంలో " సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత సినిమాలు చేసింది కానీ హిట్ అవ్వలేదు. బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది అయినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు.

వరుసగా ప్లాప్ లు పడటంతో మూవీ ఇండస్ట్రీలో కనిపించడమే లేదు ఈ బ్యూటీ. అలాంటి పూజా మేకప్ లేకుండా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై రియాక్ట్ అవుతున్న నెటిజెన్స్ బాబోయ్ ఇలా ఉందేంటని కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed