'డియర్ ఉమ' చిత్రంతో మన ముందుకు రాబోతున్న ఈ తెలుగు అమ్మాయి ఎవరో తెలుసా..?

by Prasanna |
డియర్ ఉమ చిత్రంతో మన ముందుకు రాబోతున్న ఈ తెలుగు అమ్మాయి ఎవరో తెలుసా..?
X

దిశ,వెబ్ డెస్క్: అనంతపురంకు చెందిన తెలుగు అమ్మాయి సుమయారెడ్డి మోడల్‌గా తన కెరీర్ ను ప్రారంభించింది. సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాల కోసం ఎదురుచూసిన తర్వాత సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది. సుమయ తన తొలి చిత్రం డియర్ ఉమ కోసం విభిన్నమైన క్రాఫ్ట్‌లను హ్యాండిల్ చేస్తూ మెదలుగల అందం. పృథ్వీ అంబర్‌తో కలిసి నటించిన 'డియర్ ఉమ' చిత్రంలో సుమయా రెడ్డి రచయిత, నిర్మాత మరియు ప్రధాన నటి కూడా. సుమచిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సాయి రాజేష్ మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సుమయ మరియు టీమ్ డియర్ ఉమ త్వరలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తన నటనా ప్రావీణ్యాన్ని నిరూపించుకోబోతున్న ఈ భామ సినిమా విడుదలైన తర్వాత మంచి ఆఫర్‌లను అందుకోవాలని ఆశిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed