- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'ఛావా'ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరుగా..!

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal), నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఛావా’(Chhaava). లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మించారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా కలెక్షన్ల విషయంలోనూ బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఛావా సినిమా కోసం లక్ష్మణ్ ఉటేకర్ మొదటగా టాలీవుడ్ సూపర్ స్టార్ అయినటువంటి మహేష్ బాబు(Mahesh Babu)ని అప్రోచ్ అయ్యారట. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ చిత్రంలో మహేష్ నటించడానికి అంగీకరించలేదట.
దీంతో ఈ స్టోరీను చాలా రోజులపాటు పెండింగ్‌లో పెట్టిన లక్ష్మణ్ తర్వాత హీరోగా విక్కీ కౌశల్‌ను సంప్రదించారట. ఇక ఆఫర్ వినగానే విక్కీ వెంటనే ఓకే చెప్పాడట. దీంతో ఛావా మూవీలో హీరోగా విక్కీ కౌశల్ ఫిక్స్ అయ్యారట. అలాగే మొదటగా హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ కత్రిన కైఫ్(Katrina Kaif)ను అనుకోగా ఆమె కూడా నో చెప్పడంతో రష్మికను ఓకే చేసినట్లు సమాచారం.
మరి ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఛావా మూవీ ఆడియన్స్ నుంచి ఎంత మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూస్తూనే ఉన్నాం. మరి ఇంత మంచి సినిమాను మహేష్ మిస్ చేసుకోకుండా ఉంటే మాత్రం ఆయన పాన్ ఇండియా స్టార్ రేంజ్‌లో స్టార్‌డమ్ అందుకునేవాడు అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.