తమన్నాకు ఖరీదైన ఫ్లాట్ రాసిచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా.. ?

by Prasanna |   ( Updated:2023-10-25 09:43:23.0  )
తమన్నాకు ఖరీదైన ఫ్లాట్ రాసిచ్చిన స్టార్ హీరో ఎవరో తెలుసా.. ?
X

దిశ,వెబ్ డెస్క్: తమన్నా , కార్తీ జంటగా నటించిన ఆవారా సినిమా సూపర్ హిట్ అయిన విషయం మనందరికి తెలిసిందే. ఈ సినిమాలో నటిస్తున్న సమయంలో వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలోనే చెన్నైలో ఉన్న ఓ ఖరీదైన ఫ్లాట్ ను తమన్నాకు బహుమతిగా ఇచ్చాడని తమిళ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అయింది.

సోషల్ మీడియాలో ఎన్ని వార్తలు వచ్చినప్పటికి వాటిని పట్టించుకోకుండా ఇద్దరూ ఆ ఇంట్లో కలిసి జీవించడం మొదలుపెట్టారు. తర్వాత ఈ విషయం కార్తీ తండ్రి, ప్రముఖ నటుడు శివకుమార్ దగ్గరకు చేరింది. అప్పటికే పెద్ద కొడుకు సూర్య హీరోయిన్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు చిన్న కొడుకు కూడా ఇంకో హీరోయిన్ ను ఇంటికి తీసుకురావడం తనకు ఏమాత్రం ఇష్టంలేదు. ఈ కారణంగానే కార్తీ ఇంట్లో గొడవలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో తనవల్ల ఇంట్లో గొడవలవుతున్నాయని భావించిన కార్తీ అయిష్టంగా తమన్నాకు బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది. తన తండ్రి ఇష్టం ప్రకారం 2011లో బంధువుల అమ్మాయి అయిన రజినీని వివాహం చేసుకున్నాడు. కార్తీ ఇచ్చిన ఫ్లాట్ ను తనకు తిరిగిచ్చేయాలని మిల్కీ బ్యూటీ నిర్ణయించుకుందట.. కానీ దాన్ని తీసుకునేందుకు కార్తీ అంగీకరించలేదట.. ఇప్పటికీ ఆ ఫ్లాట్ చెన్నైలో తమన్నా పేరుమీదే ఉంది.

Advertisement

Next Story