విక్రమార్కుడు 2 సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా?

by Disha Web Desk 8 |
విక్రమార్కుడు 2 సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా?
X

దిశ, సినిమా : మాస్ మహారాజ్ రవితేజ గురించి ఎంత చెప్పినా తక్కువే. చిత్ర పరిశ్రమలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ హీరో ఎన్నో సమస్యలను దాటుకొని, స్టార్ హీరోగా మారిపోయాడు. ఇక ఈయన నటించిన చాలా సినిమాలు అభిమానులకు ఎంతో ఇష్టం. ముఖ్యంగా చాలా మందికి రవితేజ అనగానే విక్రమార్కుడు గుర్తు వస్తుంది. ఈ మూవీ విడుదలై ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో రవితేజ తన నటన, కామెడీతో అభిమానులను నవ్వించాడు. అంతే కాకుండా పోలీస్ ఆఫీసర్‌లో తన నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. ఇక ఈ మూవీలో అనుష్క శెట్టి నటించి తనదైన రీతిలో అందరినీ ఆకట్టుకుంది.అయితే త్వరలో విక్రమార్కుడు 2 రానున్న విషయం తెలిసిందే.

దీంతో మాస్ మహారాజా ఫ్యాన్స్ ఆనందంలో మునిగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. కాగా, ఇది తర్వలోనే పట్టాలెక్కనుందంట. దీనికి సంపత్ నంది దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని సమాచారం. అయితే ఇప్పుడు అందరి ఆలోచన, ఈ మూవీలో హీరోయిన్ ఎవరు?

కాగా, దీనిపై ఇప్పటికీ సరైన క్లారిటీ అనేది రావడం లేదు. ఎందుకంటే?సినిమాలో రవితేజ కి తగ్గట్టుగా హీరోయిన్ పాత్ర కూడా ఉండబోతుందట. అందుకోసమని హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలని ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తోంది.మరి దీనికోసం ఎలాంటి హీరోయిన్ ను బరిలోకి దింపబోతున్నారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ మూవీలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరినితీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. కాగా, దీనిపై సరైన క్లారిటీ అనేది ఇప్పటికీ లేదు.

Next Story