Klinkaara: మెగాప్రిన్సెస్‌ క్లిన్‌కారా కేర్ టేకర్ ఎవరో తెలుసా..? ఆమె జీతం ఎంతంటే..

by Kavitha |
Klinkaara: మెగాప్రిన్సెస్‌ క్లిన్‌కారా కేర్ టేకర్ ఎవరో తెలుసా..? ఆమె జీతం ఎంతంటే..
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ కపూల్ రామ్ చరణ్- ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరికి పెళ్లి అయిన 11 సంవత్సరాల తర్వాత క్లీంకార అనే కూతురు పుట్టింది. ఈమె పుట్టినప్పటినుంచి మెగా ఇంట్లో అదృష్టం తీసుకొచ్చింది అని అందరూ అనుకుంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రిన్సెస్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అదేంటంటే.. ?

అపర కుభేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌ను జూలై 12న పెళ్లాడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరి పెళ్లిలో అనంత్ అంబానీ కేర్ టేకర్ లలితా డిసిల్వా ఫోటో నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన కళ్ల ముందే ఎదిగిన అనంత్ అంబానీ పెళ్లి చేసుకోవడంతో నాని ఎంతో ఉద్వేగానికి లోనైంది. అనంత్ చిన్నతనంలో చాలా మంచి కుర్రాడు, అతను వైవాహిక బంధంలోకి అడుగు పెట్టడం సంతోషంగా వుంది. ఆ ఇద్దరు చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొంది. దీంతో అనంత్ అంబానీకి కేర్ టేకర్‌గా చేసిన ఈమెనే ఇప్పుడు మెగా ప్రిన్సెస్ క్లీన్‌కారా కొణిదెలకు కూడా కేర్ టేకర్ చేస్తున్నది అని అందరికీ తెలిసింది. కాగా ఈమెకు నెలకు రూ. లక్ష డెబ్బై ఐదు వేల జీతం ఇస్తున్నారట. ఒకవేళ ఎక్స్‌ట్రా అవర్స్ పని చేస్తే దానికి కూడా సపరేట్ మనీ ఇస్తారంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.


Advertisement

Next Story

Most Viewed