MAHESH BABU-SITARA: సితార హైదరాబాదులో ఏ స్కూలులో చదువుతుందో తెలుసా?

by Anjali |   ( Updated:2024-07-22 15:04:41.0  )
MAHESH BABU-SITARA: సితార హైదరాబాదులో ఏ స్కూలులో చదువుతుందో తెలుసా?
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి సితార గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ క్యూటీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. వెకేషన్స్ సంబంధించిన ఫొటోలు, తన డాన్స్ వీడియోలు షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ప్రిన్స్ కు తీసిపోని విధంగా తనకంటూ సొంత ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ ఏజ్‌లోనే సితార ఇన్‌స్టాగ్రామ్ లో భారీ సంఖ్యలో ఫాలోయింగ్ సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. తండ్రి మహేష్ బాబుతో కలిసి ‘సర్కారు వారి పాట’ సినిమాలో మాస్ స్టెప్పులేసి మరింత ఫేమ్ దక్కించుకుంది. అంతేకాకుండా ప్రముఖ జ్యువెలరీ సంస్థ పీఎంజే తన బ్రాండ్ అంబాసిడర్‌గా సితారను ఎంపిక చేసుకుంది. బ్యూటిఫుల్ శారీ, నగలు ధరించిన సితార ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. జనాలు ఫిదా అయిపోతూ కామెంట్ల వర్షం కురిపించారు.

ఇకపోతే క్యూటీ సితార గురించి నెట్టింట ఓ వార్త వైరల్ అవుతోంది. సితార ఏ స్కూల్‌లో చదువుతుందంటూ జనాలు చర్చించుకుంటున్నారు. ఇటీవల ఇంటర్వ్యూకు హాజరైన నమ్రత-మహేష్ బాబుకు ఈ ప్రశ్న ఎదురవ్వగా.. సితార హైదరాబాదులోని CHIREC ఇంటర్నేషనల్ పాఠశాలలో చదువుతోందని చెప్పారు. ప్రస్తుతం తను ఏడవ తరగతి చదువుతుందని తెలిపారు.సితార సినీ ఎంట్రీ ఎప్పుడని అడగ్గా.. దానికి ఇంకా చాలా టైమ్ ఉందని సమాధానం ఇచ్చారు. చూడానికి సితార అంత హైట్ ఉన్న ఏజ్ మాత్రం చాలా చిన్నదంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Read more...

Mahesh Babu- Namratha: మహేష్-నమ్రత‌ల పెళ్లి అంత సీక్రేట్‌గా చేయడానికి కారణం ఆమెనా..? ఎట్టకేలకు బయటపడ్డ షాకింగ్...

Advertisement

Next Story