విరాట్ కోహ్లీ అనుష్క కంటే ముందు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?.. ఎంత అందంగా ఉందంటే?

by Disha Web Desk 8 |
విరాట్ కోహ్లీ అనుష్క కంటే ముందు ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?.. ఎంత అందంగా ఉందంటే?
X

దిశ, సినిమా : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ కపుల్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. అయితే తాజాగా విరాట్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రికేటర్‌కు అనుష్క కంటే ముందే ఓ ప్రేయసి ఉందంట. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా?

విదేశీ బ్యూటీ ఇజబెల్లా లైట్. ఈమెకు విరాట్, బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ఇద్దరూ మంచి స్నేహితులంట. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ తన ప్రేమ గురించి ఓపెన్ అయ్యింది. పురాణీ జీన్స్‌లో తనూజ్ విర్వాణీతో కలిసి నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమాలో ఈ బ్యూటీ అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అయితే ఇటీవల కరణ్ జోహార్ కాఫీ షోలో పాల్గొన్న ఈ బ్యూటీ చాలా విషయాలు పంచుకుంది. అందులో విరాట్‌తో ప్రేమ గురించి ఓపెన్ అయ్యింది.

ఇజాబెల్లా మాట్లాడుతూ.. క్రికెటర్ విరాట్ నాకు చాలా సన్నిహితుడు. నేను ఇండియాకు వచ్చినప్పుడు నా ఫస్ట్ ఫ్రెండ్ అతనే. నేను ఆయనతో డేటింగ్ చేశాను. రెండేళ్లపాటు మేము డేటింగ్‌లో ఉన్నాం. కానీ దానిని పబ్లిక్ చేయాలి అనుకోలేదు. కాబట్టి ఆయనతో నాకు ఇప్పటికీ మంచి రిలేషన్ ఉంది. ఇక సిద్ధార్థ్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే అని తెలిపింది. అలాగే నా సహ నటుడు తనూజ్ విర్వాణితో నాకు రిలేషన్ ఉందని రూమర్స్ వచ్చాయి. అదంతా ఫేక్, ఆయన నా సహనటుడు మాత్రమే, మేము మంచి స్నేహితులుగా ఉంటాం. కానీ మా ఇద్దరి మధ్య ఏం లేదంటూ ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Next Story

Most Viewed