jnr ఎన్టీఆర్ ఊతపదం చూస్తే షాక్ అవ్వాల్సిందే.. రోజులో అన్నిసార్లు అదే అంటాడా?

by Jakkula Samataha |   ( Updated:2024-02-29 11:36:05.0  )
jnr ఎన్టీఆర్ ఊతపదం చూస్తే షాక్ అవ్వాల్సిందే.. రోజులో అన్నిసార్లు అదే అంటాడా?
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన నటన, మంచి మనసుతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ముఖ్యంగా త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఈ మూవీలో కొమురం భీముడో.. కొమరం భీముడో అనే పాటలో ఆయన నటనకు ఎంతో మంది ఫిదా అయిపోయారు. ఇందులోనే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఏ పాత్రలోనైనా, అది నిజంగా తానే అనుకునే విధంగా ఒదిగిపోయి నటిస్తాడు. ప్రస్తుతం ఈ హీరో దేవర మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ హీరోకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తుంది, మనిషికి ఊత పదం ఉండటం అనేది చాలా కామన్. చాలా మంది ఊతపదాలను పదే పదే మాట్లాడుతూ ఉంటారు. అయితే మన ఎన్టీఆర్ కూడా స్టేటస్‌తో సంబంధం లేకుండా, ఎవరితోనైనా చాలా ఆప్యాయంగా పలకరిస్తారన్న విషయం తెలిసిందే. కొత్త వారితో కూడా , చాలా కలిసిపోయి మాట్లాడుతారు. కాగా, ఈ హీరో తనకు సంబంధించిన ఓ క్రేజీ సీక్రెట్‌ను బయట పెట్టాడు. ఎవరికైనా సరే ఊతపదం అనేది కామన్‌గా ఉంటుంది. అయితే మన జూనియర్ ఎన్టీర్‌కు కూడా ఓ ఊత పదం ఉన్నదంట. అరే నీ.. అనే పదాన్ని ఈ స్టార్ హీరో ఎక్కువగా వాడుతాడంట. కనీసం రోజుకి 100 సార్లకు పైగానే “అరే నీ” అనే పదాన్ని వాడుతానంటూ మన నటుడే ఓ ఇంటర్వ్యూలో తెలిపినట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story