- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చనిపోయిన అభిమానుల కుటుంబాలకు అండగా ఉంటా: హామీ ఇచ్చిన సూర్య
దిశ, సినిమా: హీరో సూర్యకు తమిళ్లో ఎంత క్రేజ్ ఉందో తెలుగులోనూ అంతే ఉంది. జూలై 23న సూర్య తన 48వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు అభిమానులు సూర్య బ్యానర్ కడుతూ కరెంట్ షాక్ కొట్టి మృతిచెందారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న హీరో సూర్య వెంటనే స్పందించాడు. వీడియో కాల్ ద్వారా చనిపోయిన అభిమానుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
‘నా భర్త మరణించాడు. ఇప్పుడు ఉన్న ఒక్కగానొక్క కొడుకు కూడా మరణించాడు. మా ఇంట్లో మగ దిక్కు లేకుండాపోయింది. చనిపోయి కూడా మీ ఫొటో బ్యానర్ కప్పుకున్నాడు’ అంటూ ఓ తల్లి కన్నీరుమున్నీరైంది. దీంతో ‘పోయిన కొడుకు ప్రాణాలు తీసుకురాలేను. కానీ అన్ని విధాలుగా సహాయం అందించి అండగా ఉంటాను. మీ అమ్మాయికి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను’ అని హామీ ఇచ్చి ఆ కుటుంబంలో ధైర్యం నింపాడు సూర్య.