బ్రహ్మానందం కోవై సరళను ఏమని పిలిచేవారో తెలుసా?

by Jakkula Samataha |
బ్రహ్మానందం కోవై సరళను ఏమని పిలిచేవారో తెలుసా?
X

దిశ, సినిమా : సినిమా చూడటం అందరికీ ఇష్టం ఉంటుంది. ఇక మూవీలో కామెడీ లేకపోతే అసలు ఆ సినిమా‌ను చాలా మంది ఇష్టపడరు. ఇక సినిమాల్లో ముఖ్యంగా, బ్రహ్మానందం, కోవై సరళ ఉంటే చాలు కామెడీకి కొదవే ఉండదు. ఆరోజుల్లో, ఇప్పటి వారికి కూడా ఈ జంట అంటే మంచి అభిమానం ఉంటుంది. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి సినిమా కూడా హిట్టే. ఇక ఆరోజుల్లో వీరి కోసం స్టార్ హీరోలు సైతం ఎదురు చూసేవారంట, అంతే కాకుండా ఈ జంట మూవీలో ఉన్నదంటే చాలా ఆ సినిమా థియేటర్స్ వద్ద సందడి స్టార్ హీరోల రేంజ్‌లో ఉండేది అంటున్నారు నెటిజన్స్.

అయితే తాజాగా వీరికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కోవైర సరళ ఈ మధ్య ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాంలో పాల్గొన్న విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి వీరికి సంబంధించిన అనేక వార్తలు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి. ఇక ఈ నటి, బ్రహ్మానందం గురించి మాట్లాడుతూ.. బ్రహ్మానందం గారు నాకు అన్న, తండ్రి లాగా సలహాలు ఇచ్చేవారు. నేను ఆయనతో కలిసి ఎన్నో సినిమాలు చేశాను. ఇక తాను నాతో మాట్లాడినప్పుడు, సరళ చెల్లి డబ్బులు దాచుకో అవసరానికి పనికి వస్తాయంటూ చెప్పుకొచ్చేవారంట. ఎప్పుడూ సరళ చెల్లి అంటూ చాలా అప్యాయంగా పిలిచేవారు అంటూ ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed