కొత్త సినిమాకి Vijay Devarakonda రెమ్యునరేషన్ ఏంతో తెలుసా ?

by Prasanna |   ( Updated:2023-01-22 06:53:21.0  )
కొత్త సినిమాకి Vijay Devarakonda రెమ్యునరేషన్ ఏంతో తెలుసా ?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ సమయంలో క్రేజ్ సంపాదించుకున్న హీరోల లిస్టులో విజయ్ దేవరకొండ కూడా ఒకరు. " గీత గోవిందం ", " అర్జున్ రెడ్డి " లాంటి సినిమాలు అతనికి మంచి పేరుని తెచ్చి పెట్టాయి. అంతే కాకుండా యూత్ లో ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది. పూరి జగన్నాధ్ తో 'లైగర్' సినిమా చేసారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సినిమా ప్రొడ్యూసర్స్ తో పాటు సినిమా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా నష్ట పోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ " ఖుషి " సినిమా చేస్తున్నారు. సమంత ఆరోగ్యం బాగోకపోవడంతో షూటింగ్ ఫిబ్రవరికి పోస్ట్ పోన్ చేసినట్టు తెలిసిన సమాచారం. తాజాగా కొత్త సినిమాకు విజయ్ దేవరకొండ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. జెర్సీ ఫేమ్ గౌతమ్ దర్శకత్వంలో సినిమాకు విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, త్వరలో ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుందని తెలిసింది. ఈ సినిమా కోసం విజయ్ రూ. 45 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి : నా గ్లామర్ సీక్రెట్ ఆ గదిలోనే ఉంది: Shruti Haasan

Advertisement

Next Story