పవన్ 'Khushi' సినిమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-31 02:43:20.0  )
పవన్ Khushi సినిమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: పవన్ కల్యాణ్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఖుషి సినిమా ఈ రోజు రీరిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఏంటో తెలుసుకుందాం. ఖుషి సినిమా 2001లో విడుదలైంది. దర్శకుడు ఎస్ జె సూర్య 2000లోనే తమిళ్‌లో ఈ సినిమాను విజయ్ - జ్యోతికతో తెరకెక్కించారు. ఆ తర్వాత తెలుగులో పవన్ కల్యాణ్‌తో రిమేక్ చేశారు. ఈ చిత్రాన్ని హిందీ, కన్నడలో విడుదల చేశారు. కానీ తెలుగులో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకి చెప్పాలని ఉంది అనే టైటిల్ అనుకున్నారు. కానీ పవన్ సూచన మేరకు ఖుషి టైటిల్ ఫైనల్ చేశారు. ఈ సినిమాలో పవన్ డ్రెస్సింగ్ అప్పట్లో ట్రెండ్ గా మారాయి.

గ్యాప్ హుడీస్, ఫుల్ నెక్ టీషర్ట్స్, డబుల్ షర్ట్స్ యూత్‌లో బాగా క్రేజ్ సంపాదించాయి. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ స్వయంగా ఫైట్స్ కంపోజ్ చేశారు. సినిమాలో ఫైట్స్ డిఫెరెంట్‌గా కనిపిస్తాయి. ఈ సినిమాలోని ఆడువారి మాటలకు పాట ఫుల్ ఫేమస్ అయింది. ఈ ఆలోచన కూడా పవన్ కల్యాణ్‌దే కావడం విశేషం. తెలుగు పాటలో హిందీ పదాలు రావడం చూస్తునే ఉన్నాం కానీ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో యే మేరా జహా అనే పాట హిందీలో ఉండటం విశేషం. ఫ్రెష్ లవ్ స్టోరీ కావడం, సంగీతం అందరికీ కనెక్ట్ కావడం, పవన్ మ్యానరిజం అందరికీ నచ్చడంతో ఈ సినిమా బిగ్ హిట్‌గా నిలచింది.

Also Read..

ఖుషీ రీ-రిలీజ్: థియేటర్ల వద్ద మాస్ జాతర

Advertisement

Next Story

Most Viewed