రణ్‌వీర్-దీపికల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

by Prasanna |
రణ్‌వీర్-దీపికల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్స్‌లో రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె జంట ఒకటి. వీరిద్దరూ కలిసి ‘రామ్ లీల’ సినిమాలో నటించారు. ఈ సమయంలోనే ప్రేమలో పడిన ఈ జంట దాదాపు ఆరు సంవత్సరాలు ప్రేమలో ఉండి 2018లో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇలా పెళ్లి జీవితంలోకి అడుగుపెట్టిన ఈ దంపతులు ఒకవైపు తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే మరోవైపు వృత్తిపరమైన జీవితంలో కూడా ఎంతో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళుతున్నారు.

అయితే తాజా నివేదికల ప్రకారం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈ దంపతులు భారీ స్థాయిలోనే ఆస్తులు కూడా కూడపెట్టినట్లు తెలుస్తుంది. దీపిక సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా రూ. 497 కోట్ల ఆస్తులు సంపాదించిందట. ఇక రణ్‌వీర్‌సింగ్ ఒక్కో సినిమాకు రూ.30 నుంచి రూ.40 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. దీని ప్రకారం ఈయన రూ.360 కోట్లకు పైగా ఆస్తులను కూడా పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ టాపిక్ వైరల్ అవుతుంది.

Next Story

Most Viewed