మహేశ్ బాబు, నయనతార కాంబోలో మిస్సైన సూపర్ హిట్ మూవీస్ ఏవో తెలుసా?

by samatah |   ( Updated:2023-04-15 08:12:05.0  )
మహేశ్ బాబు, నయనతార కాంబోలో  మిస్సైన సూపర్ హిట్ మూవీస్ ఏవో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయనతో నటించడాని ఏ హీరోయిన్ అయినా సరే ఇంట్రస్ట్ చూపుతుంది. అంతే కాకుందా దాదాపు మహేష్ బాబు ఎంతో మంది హీరోయిన్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. ఒక నయనతారతో తప్ప. అయితే అసలు మహేష్ బాబు నయనతారతో నటించడానికి కారణాలేంటి, వీరిద్దరి మధ్య ఏమూవీ ఎందుకు రాలేదో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే మహేష్ బాబు, నయనతారతో నటించకపోవడానికి ప్రత్యేక కారణం అంటూ ఏమీలేదంట. వీరి కాంబోలో రెండు సూపర్ హిట్ మూవీస్ వచ్చేవంట. కానీ కొన్ని కారణాల వలన అవి మిస్ అయ్యాయంట. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్‌, మహేష్ బాబు కాంబోలో వచ్చిన పోకిరి చిత్రంలో మొదటగా నయనతారను హీరోయిన్‌గా అనుకున్నారంట. దీంతో నయనతారను సంప్రదించగా, డేట్స్ ఖాళీ లేకపోవడంతో, గోవా బ్యూటీ ఇలియాన ఈ ఆఫర్ చేజిక్కించుకుంది. ఇక ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక రెండో సినిమా, దూకుడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు మూవీకి ముందుగా నయనతారనే హీరోయిన్‌గా అనుకున్నారంట. కానీ మహేష్ బాబు సమంత అయితే సెట్ అవుతుందని చెప్పడంతో, సామ్‌ని ఒకే చేశారంట. ఇలా మహేష్ బాబు, నయనతార కాంబినేషన్‌లో ఈ రెండు సూపర్ హిట్ మూవీస్ మిస్ అయ్యాయంట

Read more:

RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్‌కు రూ. 80 కోట్ల ఖర్చు.. అందుకే సంతృప్తి పొందామన్న కార్తికేయ

Advertisement

Next Story