నిత్యామీనన్ సమంత.. విషయంలో తారక్ - లక్ష్మీ ప్రణతిల ఒపీనియన్ ఏంటో తెలుసా..!

by Kavitha |
నిత్యామీనన్ సమంత.. విషయంలో తారక్ - లక్ష్మీ ప్రణతిల ఒపీనియన్ ఏంటో తెలుసా..!
X

దిశ, సినిమా: వన్ ఆఫ్ ద క్యూటెస్ట్ కపుల్ జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడ కూడా హద్దులు మీరి ప్రవర్తించకుండా నందమూరి కుటుంబ గౌరవాన్ని రోజురోజుకు ఇంకా పెరిగేలా చేస్తున్నారు. సహజంగా మనం చూస్తూ ఉంటాం స్టార్ హీరోల భార్యలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటూ ఎలాంటి దుస్తులు ధరిస్తూ ఉంటారో. అయితే లక్ష్మీ ప్రణతి మాత్రం ఎప్పుడూ తన హద్దులు మీరకుండా నందమూరి ఫ్యామిలి గౌరవాన్ని పెంపొందించేలా తన డ్రెస్సింగ్ సెన్స్ ఉంటుంది. చాలామంది నందమూరి ఫ్యాన్స్ లక్ష్మీ ప్రణతిని ఇష్టపడడానికి మెయిన్ రీసన్ ఇదేనట.

ఇదిలా ఉండగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తారక్ - లక్ష్మీ ప్రణతికి ఇష్టమైన హీరోయిన్స్ గురించి చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. అందులో భాగంగా నిత్యామీనన్ యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టమని ఎప్పటినుంచో ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. అంతేకాదు సమంత యాక్టింగ్ అంటే ఇష్టం ఉన్న ఇక ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకునే ఓపిక లేదు అని సరదాగా ఆట పట్టించారు. అంతేకాదు సమంత జూనియర్ ఎన్టీఆర్ మంచి ఫ్రెండ్స్.. ఎంతలా అంటే ప్రమోషన్స్ లోనే గొడవ పడుతూ ఉంటారు. సరదాగా ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలాగే ఉంటారు. అదే విధంగా లక్ష్మీ ప్రణతికి కూడా నిత్యామీనన్ యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని.. సమంత యాక్టింగ్ అన్న కూడా చాలా చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు తారక్. కాగా నిత్యామీనన్ చాలా నాటి ఫెలో.. సమంత చాలా అల్లరి పిల్ల అని లక్ష్మీ ప్రణతి, ఎన్టీఆర్‌ల ఒపీనియన్ అంటా. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed