SS Rajamouli ముఖ్యపాత్రలో నటించిన సినిమా ఏదో తెలుసా.. ?

by sudharani |   ( Updated:2023-12-14 14:24:28.0  )
SS Rajamouli ముఖ్యపాత్రలో నటించిన సినిమా ఏదో తెలుసా.. ?
X

దిశ, సినిమా: తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఎస్.ఎస్.రాజమౌళి ఒకరు. ఈయన కెరియర్ మొదట్లో సీరియల్స్‌కు డైరెక్టర్‌గా పని చేశాడు. తర్వాత ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాతో దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై మొదటి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక రాజమౌళి ఇప్పటి వరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించగా.. ఏ ఒక్క చిత్రం కూడా నిర్మాతలకు నష్టాలను తీసుకురాలేదు. ఇలా అపజయం ఎరుగని దర్శకుడిగా జక్కన్న పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నాడు.

అయితే దర్శకుడుగా సక్సెస్ అయినటువంటి రాజమౌళికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజమౌళి బాల నటుడిగా ‘పిల్లనగ్రోవి’ అనే సినిమాలో నటించాడు. ఈ మూవీకి తండ్రి విజయేంద్ర ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించగా.. ఆయన సోదరుడు శివశక్తి దత్త దర్శకుడు. ఇందులో రాజమౌళి, ఆయన కజిన్ శ్రీలేఖ, నిర్మలమ్మ, సోమయాజులు ప్రధాన పాత్రలు పోషించారు. మూవీ షూటింగ్ మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పరిసర ప్రాంతాలలో జరిగింది. కానీ చిత్రాన్ని మాత్రం రిలీజ్ చేయలేకపోయారు. కాగా అప్పుడు జక్కన్న వయసు కేవలం 10 సంవత్సరాలని తెలుస్తుంది.

Advertisement

Next Story