పవన్ కళ్యాణ్ పిఠాపురం చరిత్ర తెలుసా.. అక్కడి ఓ రాణి కథ తెలిస్తే షాక్ అవుతారు!

by Jakkula Samataha |
పవన్ కళ్యాణ్ పిఠాపురం చరిత్ర తెలుసా.. అక్కడి ఓ రాణి కథ తెలిస్తే షాక్ అవుతారు!
X

దిశ, సినిమా : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిచి, డిప్యూటీ సీఎంగా అసెంబ్లీలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో పిఠాపురం హాట్ టాపిక్‌గా మారి పోయింది. ఆయన ప్రచారం చేసే సమయంలో చాలా మంది మేము పిఠాపురం ఎమ్మెల్యే తాలుకా అంటూ బైక్ పై పోస్టర్ వేసుకున్న ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం పిఠాపురానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? పిఠాపురం కాకినాడ జిల్లాలో ఉంది. దీనిని ముందుగా పీఠికాపురం అని పిలిచేవారంట. అయితే ఈ పిఠాపురానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. అది కూడా ఓ రాణి కథ. దాని గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పిఠాపురం రాజా కుటుంబం నుంచి ఉయ్యూరు సంస్థానంలో అడుగు పెట్టి, బరోడా సంస్థానాధీశుడిని పెళ్లి చేసుకొని ఇస్లాం మతంలోకి మారిన ఓ రాణి సీతా దేవి కథ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందంటే?

సౌందర్యవతి అయిన మహారాణి పేరు సీతా దేవి. ఈమె ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడిపేది. పిఠాపురం రాజా కుటుంబానికి చెందిన ఈమెను ఉయ్యూరు సంస్థానానికి చెందిన ఓ రాజుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఒక బాబు కూడా జన్మించారు. ఇక గుర్రపు స్వారీలు చేయడం ఈమెకు ఎక్కువ ఇంట్రెస్ట్ . తన భర్తతో కలిసి గుర్రపు స్వారీలు చేసేది. అయితే ఈమెను చూసిన ఓ మహారాజా ప్రతాప్ సింగ్ గైక్వాడ్ ఈమె అందానికి మగ్ధడైపోయాడు. ఈయన అత్యంత ధనవంతుల్లో ఒకరు. దీంతో ఈమెను 1943లో వివాహం చేసుకున్నారు. దీంతో వీరి వివాహానికి బ్రిటిష్ వైస్రాయి నుంచి అభ్యంతరాలు వచ్చాయి.

దీంతో వీరు మాంటె కార్లో సిటీకి వెళ్లి అక్కడ ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత భారత దేశానికి స్వాతంత్ర్యం రావడంతో సంస్థానాలు భారత ప్రభుత్వంలో విలీనం చేసుకోవడంతో, ప్రతాప్ సింగ్ గైక్వాడ్ సంస్థానాధిపతి హోదా నుంచి తొలగించాల్సి వచ్చింది. తర్వాత 1956లో ఈయన తన భార్య సీతాదేవికి విడాకులు ఇచ్చారు. 1985లో మహారాణి కుమారుడు కూడా సూసైడ్ చేసుకోవడం తో కుంగిపోయిన సీతా దేవి, 1989 ఫిబ్రవరి మరణించిందంట.

Advertisement

Next Story

Most Viewed