- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రవితేజకు మాస్ మహారాజా అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన వారిలో రవితేజ ఒకరు. ఎన్నో కష్టాలు, సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకుని నిలబడిన ఆయన.. ఇప్పుడూ టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. మొదట చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఆ తర్వాత హీరోగా అవతారం ఎత్తి, కథల ఎంపికలో జాగ్రత్తపడి.. సూపర్ హిట్ మూవీస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే ప్రతి హీరోకి స్టార్ డమ్ వచ్చాక అభిమానంతో బిరుదులు ఇచ్చేస్తుంటారు ఫ్యాన్స్. అలా రవితేజకు మాస్ మహారాజా అనే ట్యాగ్ ఇచ్చేశారు.
అయితే ఈ ట్యాగ్ తనకు ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? అంటే.. గతంలో రవితేజ హీరోగా జ్యోతిక హీరోయిన్‌గా నటించిన ‘షాక్’ సినిమా చూసే ఉంటారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోగా.. దర్శకుడు హరీశ్ శంకర్‌కు ఆ తర్వాత స్టార్ డైరెక్టర్స్‌లో ఒకరిగా మారిపోయాడు. అయితే ఈ ‘షాక్’ మూవీ ప్రమోషన్స్ అప్పుడు హరీశ్ శంకర్ ప్రతి ఒక్కరిని ఏదైనా స్పెషల్ ట్యాగ్‌తో స్టేజీ మీదకు పిలవాలని డిసైడ్ అయ్యాడట. అలా రవితేజను మాస్ మహారాజా రవితేజ అని పిలిచాడట. ఇక అప్పటి నుంచి రవితేజను అభిమానులు ముద్దుగా ఇలాగే పిలుచుకుంటున్నారు.