Samantha: సోషల్ మీడియా ద్వారా సమంత ఇన్‌కమ్ ఎంతో తెలుసా..?

by Sathputhe Rajesh |   ( Updated:2022-06-10 08:57:17.0  )
Samantha earns 3 to 5 crores in a month to promote brands on social media
X

దిశ, సినిమా: Samantha earns 3 to 5 crores in a month to promote brands on social media| ప్రస్తుతం సోష‌ల్ మీడియా వేదికగా సినీ తార‌లు, అభిమానుల‌కు మ‌ధ్య మంచి కమ్యునికేషన్ ఏర్పడుతోంది.ఈ మేరకు తమ మూవీ అప్‌డేట్స్, పర్సనల్ లైఫ్ విశేషాల‌ను ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్న స్టార్స్.. ఈ ప్లాట్‌ఫామ్స్‌‌ను ఆదాయ వనరుగా కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ సమంతను ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే.. ఇన్‌స్టాలో దాదాపు 24 మిలియన్స్ ఫాలోవ‌ర్స్ కలిగివుంది. దీంతో ఇన్‌స్టా తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా బ్రాండ్స్‌ ప్రమోట్‌చేస్తూ భారీగా ఆర్జిస్తోంది స‌మంత‌. ఈ క్రమంలోనే ఇటీవ‌ల బికినీ బ్రాండ్ ఫొటోలు పోస్ట్ చేయగా.. వైర‌ల్‌గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ పిక్స్ పట్ల అభిమానులు సైతం నిరాశ చెందారు. ఇదిలా ఉంటే.. ఒక్కో సినిమాకు ఆమె రూ. 3 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు స‌మాచారం. ఇదిలా ఉంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్స్ ప్రమోట్ చేసినందుకు నెల‌కు రూ.3-5 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు చెబుతోంది. ఈ లెక్కన ఆదాయం పరంగా చాలా ముందు చూపుతో వ్యవహరించాలని అవసరముందని ఇతర సెలబ్రెటీలు భావిస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed