అంబానీ ప్రీ-వెడ్డింగ్‌లో సల్మాన్ ఖాన్ స్పెషల్ షో.. దీని కోసం ఎంత డబ్బు వసూలు చేస్తున్నాడంటే?

by Kavitha |   ( Updated:2024-03-02 07:46:12.0  )
అంబానీ ప్రీ-వెడ్డింగ్‌లో సల్మాన్ ఖాన్ స్పెషల్ షో.. దీని కోసం ఎంత డబ్బు వసూలు చేస్తున్నాడంటే?
X

దిశ, సినిమా: ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల పెళ్లి గురించే చర్చలు జరుగుతున్నాయి. కాగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో శుక్రవారం (మార్చి01) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశ విదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, సినీ తారలు, క్రికెటర్లు ఈ గ్రాండ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భాగం కానున్నారు.

ఇక ఈ గ్రాండ్ ఈవెంట్ లో అందరిని ఉర్రూతలూగించే విధంగా ఒక షో చేయాలని బాలీవుడ్ సెలబ్రిటీలు తెగ కసరత్తులు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పర్ఫామెన్స్ మాత్రం సల్మాన్ ఖాన్‌దే అని చెప్పాలి. ఈ వేడుకలలో సల్మాన్ ఖాన్ ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు.అయితే సాధారణంగా సల్మాన్ ఖాన్ వివాహాలు లేదా ఇతర ప్రైవేట్ ఈవెంట్‌లల్లో పర్ఫామెన్స్‌లు చేయడానికి దాదాపు ఐదుకోట్ల రూపాయల ఫీజులు డిమాండ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు అంబానీ స్టేటస్‌ను బట్టి సల్మాన్ ఖాన్ మరింత భారీగా ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది అని తెలుస్తుంది. కాగా ఈ స్పెషల్ పెర్ఫార్మెన్స్‌కి సల్మాన్ దాదాపు రూ. 10 కోట్ల వరకు చార్జ్ చేసినట్లు తెలుస్తోంది.

Read More..

కొన్ని గంటల్లో అనంత్ -రాధిక పెళ్లి.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన నీతా అంబానీ (వీడియో)

Advertisement

Next Story