60 ఏళ్ల ప్రస్థానంలో కైకాల ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?

by samatah |   ( Updated:2022-12-23 02:57:33.0  )
60 ఏళ్ల ప్రస్థానంలో కైకాల ఎన్ని సినిమాల్లో నటించారో తెలుసా?
X

దిశ, వెబ్‌ డెస్క్ : సినిమాలో యుముడు గెటప్ అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చే పేరు కైకాల సత్యనారాయణ. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ సినిమాలో ఏ పాత్ర ఇచ్చినా దానికి న్యాయం చేస్తారు. అంతే కాకుండా తన నటనతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1959లో 'సిపాయి కూతురు' అనే సినిమాతో ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ సినీ రంగ ప్రవేశం చేశారు. ఎస్వీ రంగారావు తర్వాత వైవిధ్యమైన పాత్రలు పోషించడంలో కైకాల టాలీవుడ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. గత 60 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో కొనసాగిన కైకాల మొత్తంగా 777 సినిమాల్లో నటించి భళా అనిపించాడు. అంతే కాకుండా టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితోనూ కైకాల నటించారు. ఏ పాత్రలోనైనే ఒదిగిపోవడంతో ఈయనకు నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక కైకాల సత్యనారాయణ కృష్ణ జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామాలో 1935 జులై 25 న లో జన్మించారు. ఈయనకు ఏప్రిల్ 10 1960 లో నాగేశ్వరమ్మ తో వివాహం జరిగింది. ఈయనకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

Also Read....

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత

Advertisement

Next Story