- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రజాకార్‌లో నిజాం భార్యగా నటించిన బ్యూటీ ఎవరు..ఈమె గురించి తెలుసా?
దిశ, సినిమా : హైదరాబాద్ నిజాం సంస్థానానికి సంబంధించిన కథతో దర్శకుడు యాట సత్యనారాయణ తెరకెక్కించిన సినిమా ‘రజాకార్’. ఇక ఈ సినిమాలో అనసూయ,బాబీ సింహా, మార్కండ్ దేశ్‍పాండే, రాజ్ అర్జున్, వేదిక, అనుష్య, ఇంద్రజ, కీలకపాత్రలు పోషించారు. అయితే ఈ సినిమాలో నిజాం భార్యగా అనుశ్రియ త్రిపాఠి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
నిజాం భార్యగా తెలుగు ప్రేక్షకులను ఈ ముద్దుగుమ్మ ఆకట్టుకోవడంతో ఈమె కోసం అభిమానులు నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. కాగా, ఈ చిన్నదాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అనుశ్రియ నాన్న సిఏ, అమ్మ హౌస్ వైఫ్. మొదట మోడలింగ్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె, 2018లో చత్తీస్ ఘడ్ నుంచి మిస్ ఇండియా పోటిల్లో పాల్గొంది.అంతేకాకుండా ఈ బ్యూటీ బెంగళూరులోని కాలేజీలో తన డిగ్రీ పూర్తి చేసి అక్కడే థియేటర్స్ ఆర్ట్స్ గ్రూపులో మెంబర్‌గా ఉన్నట్లు తెలిపింది. ఆ సమయంలోనే నటనపై ఆసక్తి ఏర్పడినా, తన నాన్న సివిల్స్ చదవాలని కోరుకోవడంతో, దాదాపు మూడేళ్లు చదువుపై ఫోకస్ చేసి ఆతర్వాత నటికావాలనే ఇంట్రెస్ట్‌తో ఆమె చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక ఈ క్రమంలో అవకాశం కోసం ఎదురు చూడగా, రజాకార్ దర్శకుడిని సంప్రదించగా, ఆయన నిజాం భార్యగా నటించే పాత్ర కోసం అనుశ్రియను ఎంపిక చేయడం ఆమె ఈ పాత్రలో నటించడం జరిగింది.
ఇక ఈ అమ్మడు ఇటీవల మూవీ గురించి మాట్లాడుతూ.. రజాకర్ సినిమాలో నిజాం భార్యగా నటించాను. ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్ర. వాస్తవ పరిస్థితులను నిజాంకు తెలియజేసేది. కథ చెప్పినప్పుడు నా పాత్ర సవాల్ గా అనిపించింది. అలాగే ఇందులో వున్న ఏకైక గ్లామర్ రోల్ నాదే. ఇలాంటి బలమైన కథ, పాత్రతో నా కెరీర్ ప్రారంభం కావడంతో నా కల నెరవేరింది. నాకు చాలా సంతోషంగా అనిపించిందని చెప్పుకొచ్చింది.
Read More..
తెలుగు అమ్మాయిని సపోర్ట్ చేయాల్సింది పోయి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.. నటి ఎమోషనల్ కామెంట్స్!