గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్.. అదితి మొదటి భర్త గురించి తెలుసా?

by Disha Web Desk 8 |
గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేసుకున్న సిద్ధార్థ్.. అదితి మొదటి భర్త గురించి తెలుసా?
X

దిశ, సినిమా : గుట్టు చప్పుడు కాకుండా హీరోయిన్ అదితి రావు హైరీ, హీరో సిద్ధార్థ్‌ను అతికొద్ది మంది బంధవుల మధ్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మహాసముద్రం సినిమాతో వీరి మధ్య ప్రేమ చిగురించిది. దీంతో అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నారంటూ అనేక వార్తలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఆ రూమర్స్‌కు చెక్ పెడుతూ వీరు మూడు ముళ్ల బంధంతో ఒకటి అయ్యారు.

ఇక అదితి రావు హైదరీకి ఇది రెండో పెళ్లి. దీంతో ప్రస్తుతం ఈ నటి మొదటి భర్తకు సంబంధించిన న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.అదితి, సత్యదీప్ మిశ్రాను వివాహం చేసుకొని అతని నుంచి విడిపోయింది. ఇక విడాకుల తర్వాతనే ఈ బ్యూటీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. సత్యదీప్ ముంబైలో నటనా వృత్తిని ప్రారంభించే ముందు న్యాయవాదిగా పనిచేశాడు. అతను బాంబే వెల్వెట్, నో వన్ కిల్డ్ జెస్సికా, ఫోబియా, విక్రమ్ వేద వంటి చిత్రాలలో నటించాడు.కాగా, అతిధితో విడాకుల అనతరం ఈయన వెస్టిండీస్ మాజీ క్రికెట్ర వివియన్ రిచర్డ్స్ కుమార్తె మసాబా గుప్తాను గతేడాది వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక సిద్ధార్థ్‌కు కూడా మొదటి పెళ్లి విఫలం కావడంతో, ఈయన రెండో పెళ్లి చేసుకున్నాడు.


Next Story

Most Viewed