- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Neha Shetty: వైట్ డ్రెస్ లో కాక రేపుతున్న డీజే టిల్లు భామ
దిశ, సినిమా : డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క మూవీతో క్రేజ్ సంపాదించుకుని బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకెళ్తున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రస్తుతం అలా అలా వెళ్తుంది. కథను ఎంచుకోవడంలో విఫలమవుతుదంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. కన్నడ మూవీ 'ముంగారు మేల్ 2' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ మూవీ యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది.
ఇక తెలుగులో ఆకాశ్ పూరీ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'మెహబూబా' సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 'గల్లీ రౌడీ' మూవీలో చేసింది. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాలో మెరిసి అందర్ని ఆశ్చర్యపరిచింది. ఇక 'డీజే టిల్లు' తర్వాత ఈ ముద్దుగుమ్మ సినీ కెరియర్ మొత్తం మారిపోయింది. ఈమెకు తెలుగులో వరుస ఆఫర్స్ పలకరించాయి. తాజాగా, నేహా శెట్టి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్స్ ఖాళీగా ఉంటే ఫోటో షూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారన్న విషయం మనకీ తెలిసిందే. దీని వలన వారికీ సినిమా అవకాశాలు తొందరగా వస్తాయి. సీనియర్ హీరోయిన్ నుంచి జూనియర్ హీరోయిన్ వరకు ఇదే ట్రెండును ఫాలో అవుతున్నారు. అయితే, తాజాగా నేహా శెట్టి వైట్ డ్రెస్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఇవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.