- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Divorce : ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు.. కూతురు ఆరాధ్య దారి ఎటువైపు అంటే?
దిశ, సినిమా : బాలీవుడ్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న వార్త ఏదైనా ఉన్నదా అంటే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ విడాకుల వార్తే. వీరు ధూమ్ 2 సినిమాతో ప్రేమలో పడి, జనవరి14,2007లో ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇక ఈ కపుల్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ గత కొన్ని రోజుల నుంచి వీరు విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారు, ప్రస్తుతం వీరు వేరు వేరుగా ఉంటున్నారు అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు వీరు విడిపోవడం రూమర్సే అంటుంటే, బాలీవుడ్ సినీ వర్గాలు మాత్రం వస్తున్న వార్తలు వాస్తవమే అని తేల్చేస్తున్నాయి.
ఇప్పటికీ వీరు వివాహం చేసుకొని 17ఏళ్లు గడిచిపోతున్నాయి. వీరికి పెళ్లి జరిగిన నాలుగు సంవత్సరాలకు పాప ఆరాధ్య జన్మించింది. ఇక వీరు చాలా సంతోషంగా కలిసి కాపురం చేస్తున్నారు, బెస్ట్ కపుల్ అనుకునే లోపే విడాకుల వార్త తెరపైకి వచ్చింది. చాలా రోజుల నుంచి ఈ పుకార్లు వస్తున్నా..ఐశ్వర్యరాయ్, అభిషేక్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇవి రూమర్స్‌గానే మిగిలిపోయాయి. కానీ అత్యంత సంపన్నుడు అంబానీ ఇంట వివాహానికి అభిషేక్ బచ్చన్ తన కుటుంబంతో రాగా, ఐశ్వర్య రాయ్, ఆరాధ్య వేరు వేరుగా వచ్చారు. దీంతో ఈ రూమర్స్‌కు ఆజ్యంపోసినట్లైంది. నిజంగానే విశ్వ సుందరి, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారు అని క్లారిటీ వచ్చింది అంటున్నారు కొందరు. అంతే కాకుండా, వీరు చాలా రోజుల నుంచి వేరు వేరుగా ఉంటున్నారంట. అమితాబ్ అధికార నివాసం జల్సా నుంచి ఐశ్వర్యరాయ్ తన తల్లిగారి ఇంటికి వెళ్లిందని, గత కొన్ని రోజుల ముందే ఐశ్వర్య రాయ్ జల్సా లో కాకుండా దాని పక్కనే ఉన్న మరో ఇంట్లో తన కూతురు ఆరాధ్యతో కలిసి ఉన్నట్లు బాలీవుడ్ మీడియా కంట పడినట్లు సమాచారం. అంతే కాకుండా ప్రస్తుతం ఈ బ్యూటీ తన తల్లిగారింటికి, ముంబై వెళ్లి అక్కడే ఉంటుందంట.
ఇదే కాకుండా బాలీవుడ్‌లో మరో వార్త కూడా తెగ చక్కెర్లు కొడుతుంది. అది ఏమిటంటే? విశ్వసుందరి, అభిషేక్ త్వరలో విడాకులు తీసుకోబోతున్నారని, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక వారి కుమార్తె ఆరాధ్య బచ్చన్ ఫ్యామిలీలోనే ఉండేలా నిర్ణయం జరిగింది. దాదాపు వీరి విడాకులు ఖాయమైనట్టే అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. ఇక ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ, అంబానీ పెళ్లి తర్వాత నుంచి వీరి విడాకు ఇష్యూ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఇక దీనిపై ఓ క్లారిటీ రావాలంటే వీరు స్పందించాల్సిందే అంటున్నారు తమ అభిమానులు.