- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధనుష్‌తో విడాకులు.. రెండేళ్ల తర్వాత రజినీకాంత్ కూతురు సెన్సేషనల్ కామెంట్స్
దిశ, సినిమా: తలైవా పెద్ద కూతురు ఐశ్వర్య కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 2004లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాపురం కొన్నాళ్ల పాటు సాఫీగానే సాగినప్పటికీ ఇద్దరు పిల్లలు పుట్టాక మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో రెండేళ్ల క్రితం ధనుష్, ఐశ్వర్య విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే ఐశ్యర్య ఒంటరిగా ఉంటూనే డైరెక్టర్‌గా పలు చిత్రాలు తెరకెక్కిస్తుంది. ఇటీవల రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన లాల్ సలాం సినిమాకు ఐశ్వర్య దర్శకత్వం వహించింది. ఇక ధనుష్ తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు.
తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తన విడాకుల పై నోరు విప్పింది. ‘‘ గత రెండేళ్లుగా ఒంటరితనంతోనే సాహసం చేస్తూ ఆస్వాదిస్తున్నాను. నేను గ్రహించిన ఓ ముఖ్య విషయం ఏంటంటే ఒంటరిగా ఉన్నప్పుడే మరింత సురక్షితంగా ఉండగలం. ఈ ఏకాంతం నాకు చాలా బాగా నచ్చింది. ఒకప్పుడు పిల్లల కోసం బ్రేక్ తీసుకున్నాను. కానీ ప్రపంచం చాలా వేగంగా ముందుకు వెళ్లిపోతుంది. టైమే తెలియడం లేదు. పిల్లలు ఎదిగే సమయంలో వారితో ఉండాలనుకుంటున్నాను. జీవితాన్ని ఒంటరిగా లాక్కు రావడమే ఈజీగా ఉంది’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఐశ్వర్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.