సూర్యతో రొమాన్స్‌కు రెడీ అంటున్న బాలీవుడ్ బ్యూటీ

by sudharani |
సూర్యతో రొమాన్స్‌కు రెడీ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటాని కోలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం తమిళ స్టార్ నటుడు సూర్య హీరోగా బాలా దర్శకత్వంలో 'వణంగాన్‌' చిత్రం తెరకెక్కుతుండగా.. తన తదుపరి ప్రాజెక్టు చిరుతై శివ డైరెక్షన్‌లో రానుంది. పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందనున్న ఈ మూవీలో ముందుగా నటి పూజా హెగ్డేను కథనాయికగా అనుకున్నప్పటికీ.. ప్రస్తుతం తన ప్లేస్‌లో బాలీవుడ్ నటి దిశా పటానీనిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

Advertisement

Next Story