- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'ఉపాసన గారు మీ భర్తను ఎడ్యుకేట్ చేయండి '.. రామ్ చరణ్ ట్వీట్‌పై చర్చ
దిశ, డైనమిక్ బ్యూరో: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన ట్వీట్ పై రచ్చ మొదలైంది. చరణ్ చేసిన పై బీఆర్ఎస్ అభిమానులు, రామ్ చరణ్ ఫ్యాన్స్ రెండుగా చీలి ట్విట్టర్ లో వార్ కు దిగుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. రామ్ చరణ్ సమర్పణలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న సినిమా 'ది ఇండియా హౌస్'. ఈ సినిమాను ప్రకటిస్తూ రామ్ చరణ్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. ‘దేశ స్వాతంత్ర సమరయోధుడు వీర సావర్కర్ 140వ జయంతి సందర్భంగా పాన్ ఇండియా సినిమా 'ది ఇండియా హౌస్'ని ప్రకటిస్తున్నందుకు గర్విస్తున్నాము. నిఖిల్, సిద్దార్థ, అనుపమ్ ఖేర్ ముఖ్యపాత్రలో రామ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. జైహింద్’ అంటూ ఈ సినిమాకు సంబంధించిన వీడియోను రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. బీఆర్ఎస్ మద్దతుదారుడిగా చెప్పుకుంటున్న ఓ ట్విట్టర్ యూజర్ కాస్త ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. సావర్కర్ గురించి రామ్ చరణ్ కు ఏం తెలుసు? ఉపాసన గారు దయచేసి మీ భర్తను ఎడ్యుకేట్ చేయండి అంటూ రీట్వీట్ చేశాడు. దీనిపై రామ్ చరణ్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్, రామ్ చరణ్ లు మంచి స్నేహితులు అని అనవసరంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ జోలికి రావద్దని హెచ్చరిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో ఈ విషయంలో బీఆర్ఎస్ మద్దతు దారులు సైతం వెనక్కి తగ్గడం లేదు. రామ్ చరణ్ గారు.. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ అంటూ బీఆర్ఎస్ మద్దతు దారులు ట్వీట్ చేస్తున్నారు. మొత్తంగా సావర్కర్ జయంతి సందర్భంగా రామ్ చరణ్ చేసిన ట్వీట్ రచ్చకు దారితీయగా ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో అనేది ఉత్కంఠగా మారింది.
Read more:
భర్తకు దూరమయ్యాక వాటికి దగ్గరవుతోన్న మెగా డాటర్.. పిక్స్ వైరల్
ఆ కారణంతోనే చరణ్ కొత్త ప్రొడక్షన్ హౌస్‌లోకి నిఖిల్‌ను తీసుకున్నాడా?