భర్తకోసం కోట్లు ఇచ్చినా సరే ఆ పని చేయనంటున్న కాజల్.. షాక్‌లో డైరెక్టర్స్ !

by Jakkula Samataha |
భర్తకోసం కోట్లు ఇచ్చినా సరే ఆ పని చేయనంటున్న కాజల్.. షాక్‌లో డైరెక్టర్స్ !
X

దిశ, సినిమా : చందమామ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ముద్దుగుమ్మ కాజల్. ఈ అమ్మడు తన అందచందాలతో, నటనతో అందరినీ మెస్మరైజ్ చేసింది. మగధీర సినిమాతో కాజల్ లైఫ్ టర్న్ అయ్యిందనే చెప్పవచ్చు.ఆ సినిమా తర్వాత కాజల్ టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా తన టాలెంట్ నిరూపించుకుంది.

ఇక ఈ మధ్య ఈ బ్యూటీకి సంబంధించిన ఏ న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ అవుతుంది. కాగా, తాజాగా కాజల్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ . అది ఏమిటంటే? సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ బ్యూటీ కొత్త కండీషన్స్ పెడుతూ డైరెక్టర్స్‌కే ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తోందంట. ఆమె దర్శకులకు నాకు మీరు రెమ్యూనరేషన్ తక్కువగా ఇచ్చినా సరే నేను రొమాంటిక్ సీన్స్‌లలో మాత్రం నటించను అంటూ తెగేసి చెప్తోందంట. అంతే కాకుండా లిప్ లాక్, ఎక్స్పోజింగ్ పాత్రలు చేయను అని చెప్పిదంట. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే కాజల్ ఈ డెసిషన్ తీసుకోవడానికి కారణం ఆమే భర్తే. తన భర్తకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని, ఆయనకు బ్యాడ్ నేమ్ రాకూడదని ఈ ముద్దుగుమ్మ దర్శకులకు ఇలాంటి కండీషన్స్ పెడుతున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed