ప్రభాస్ ఒక నాన్సెన్స్ యాక్టర్.. అతని సినిమాలన్నీ చెత్తగా ఉంటాయి.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి

by samatah |   ( Updated:2023-07-08 07:16:17.0  )
ప్రభాస్ ఒక నాన్సెన్స్ యాక్టర్.. అతని సినిమాలన్నీ చెత్తగా ఉంటాయి.. దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి
X

దిశ, సినిమా: వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ హీరో ప్రభాస్ పై దిగ్గజ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి షాకింగ్ కామెంట్స్ చేశాడు. ‘ ‘సలార్’ టీజర్‌ను చూశాను. అదొక లౌడ్ సౌండ్‌తో కూడిన నాన్సెన్స్ యాక్షన్‌‌. ఎవరు హింసాత్మకంగా పుట్టరు. మీ పిల్లల మైండ్స్‌ ను శాంతివైపు నడిపించాలి. ఇలాంటి ఇండస్ట్రీలో ప్రముఖులు ప్రసిద్ధ సాహిత్యం, సినీ రాజకీయాల్లోని హింసను గ్లామరైజ్ చేయడం ఫ్యాషన్ అయింది. ఈ ‘సలార్’ సినిమాలో మితిమీరిన వాయిలెన్స్ చూపించాడు. అర్థంలేని ఇలాంటి సినిమాలను ప్రమోట్ చేయడం, అసలు నటుడే కాని వ్యక్తిని బిగ్గెస్ట్ స్టార్‌గా చెప్పుకోవడం పెద్ద టాలెంట్‌ అనుకుంటున్నారు. అతని ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్న వారికి కూడా అసలు ఏమీ తెలియదని అర్థం చేసుకోవాలి' అంటూ ప్రభాస్ ని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు వివేక్.

Read More: చేతులు జోడించి ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన ‘Adipurush’ రైటర్.. ట్వీట్ వైరల్

Advertisement

Next Story

Most Viewed