- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమీర్ ఖాన్ భార్యకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా
దిశ, సినిమా: తీసిన రెండు సినిమాలతోనే పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మారిపోయాడు సందీప్ రెడ్డి వంగా. తాజాగా వచ్చిన ‘యానిమల్’ మూవీకి ఎలాంటి స్పందన వచ్చిందో మనకు తెలిసిందే. కలెక్షన్ల పరంగా ధూమారం లేపినప్పటికి ఈ సినిమా పై విమర్శలు కూడా భారీగా వచ్చాయి. ఈ నెగిటివిటి పై స్పందింస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఎలా ఇవ్వాలో అలా ఇచ్చేస్తున్నాడు దర్శకుడు. అయితే ఈ లిస్ట్ లో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ భార్య కిరణ్ రావు కూడా చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘యానిమల్’ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ ‘బాహుబలి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ మూవీస్ స్త్రీల పట్ల ద్వేషం, వేధింపులను ప్రోత్సహించేలా ఉన్నాయి’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక ఈ కామెంట్లుకి సందీప్ రెడ్డి తనదైన రేంజ్ కౌంటర్ ఇచ్చారు. ‘ ఆమె అన్న వ్యాఖ్యలు నేను విన్నాను.. ఆమెకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఆమె మాజీ భర్త అమీర్ ఖాన్ ను వెళ్లి అడగమనండి.. ఆయన నటించిన ‘దిల్’ సినిమాలో హీరోయిన్ ను రేప్ కు ప్రేరేపించేలా చేస్తారు. అది కూడా తప్పు చేసిందని నమ్మిస్తాడు. అలాంటిది చివరికి ఈ అమ్మాయి హీరో ని ప్రేమిస్తుంది. మరి దీని అర్ధం ఏంటీ.ఇలాంటివన్నీ తెలుసుకోకుండా మాపై ఎలా దాడి చేస్తారో అర్థం కావడం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు సందీప్. ప్రస్తుతం సోషల్ మీడియా జరుగుతున్నా ఈ వార్ పై కొందరు ఈ డైరెక్టర్ ను ప్రశ్నిస్తూనే.. మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు.
Read More..