- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రికెట్ రంగంలోకి డైరెక్టర్ SS Rajamouli.. ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ చైర్మన్‌గా నియామకం
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ISBC) కీలక నిర్ణయం తీసుకుంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళిని ఐఎస్‌బీసీ తమ ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. డైరెక్టర్ రాజమౌళిని ఐఎస్‌బీసీ గౌరవ చైర్మన్‌గా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. దీంతో ఇన్నాళ్లు డైరెక్టర్‌గా ఉన్న రాజమౌళి ఇప్పటి నుండి మరో కొత్త రోల్‌లో కనిపించనున్నారు. అంతేకాకుండా బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్‌ను ఐఎస్‌బీసీ సంస్థ చీఫ్ ప్యాట్రన్‌గా నియమించింది. టీమిండియా మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్‌ను ఐఎస్‌బీసీ ప్రధాన సలహాదారుగా ఎన్నుకుంది. కాగా, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ నైపుణ్యాన్ని గుర్తించేందుకు ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్ (ISBC) సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థ దేశంలో స్కూల్ పిల్లల్లో క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు కృషి చేస్తోంది.
ఇవి కూడా చదవండి: నాగార్జునతో ముద్దు సీన్స్ చేయడం వల్లే ఆఫర్స్ తగ్గాయి: స్టార్ హీరోయిన్ హాట్ కామెంట్స్