Hanuman: ‘హనుమాన్’ ఫ్యాన్స్‌కు డబుల్ గుడ్ న్యూస్.. ఓటీటీలో, టీవీలో ఒకేసారి చూసే ఛాన్స్!

by Hamsa |   ( Updated:2024-03-09 14:01:51.0  )
Hanuman: ‘హనుమాన్’ ఫ్యాన్స్‌కు డబుల్ గుడ్ న్యూస్.. ఓటీటీలో, టీవీలో ఒకేసారి చూసే ఛాన్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘హనుమాన్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీసును షేక్ చేసింది. అంతేకాకుండా భారీ కలెక్షన్స్ రాబట్టి ఊహించని విధంగా అందరి మెప్పు పొందింది. అయితే ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై దాదాపు 2 నెలలు పూర్తి కావొస్తుంది. అయినప్పటికీ డిజిటల్ స్ట్రీమింగ్ నోచుకోలేదు. దీంతో హనుమాన్ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇటీవల హనుమాన్ శివరాత్రి వస్తుందని నెట్టింట వార్తలు వైరల్ కావడంతో సంతోష పడ్డారు.

కానీ సినీ ప్రియులకు నిరాశే మిగిలింది. దీనిపై అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్విట్టర్ వేదికగా డబుల్ గుడ్ న్యూస్ ప్రకటించాడు. ‘‘ఈ సినిమా మార్చి 16న ప్రముఖ ఓటీటీ సంస్థ జియో సినిమాలో స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తుంది. అంతేకాకుండా సినీప్లెక్స్ ఛానెల్‌లో మార్చి 16న రాత్రి 8 గంటలకు టీవీలో ప్రసారం అవుతుంది’’ అని రాసుకొచ్చాడు. అయితే తెలుగులో ఎప్పుడనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. అయినప్పటికీ సినీ ప్రియులు హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు.

Advertisement

Next Story