- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైరెక్టర్ శంకర్‌కు కమల్ హాసన్ ఖరీదైన గిఫ్ట్.. దాని ధర ఎంతో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, భారతీయుడు-2 సినిమాలను రూపొందిస్తున్నాడు. అయితే లోకనాయకుడు కమల్ హాసన్ ‘ఇండియన్-2’ మూవీని కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా ఆ సినిమా రాబోతుంది. వీరిద్దరి కాంబినేషనల్‌లో వస్తున్న రెండవ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా, ఇందులోని కొన్ని సన్నివేషాలను చూసి కమల్ హాసన్ ఇంప్రెస్ అయి శంకర్‌కు ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారు. ఆయనకు ఓ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. దీని ధర రూ. 8 లక్షల వరకు ఉంటుందని సమాచారం.
ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు ఇండియన్-2 చిత్రంలోని ప్రధాన సన్నివేశాలను చూశాను. శంకర్‌కు నా అభినందనలు. ఇది మీ కళాత్మక జీవితంలోనే అత్యుత్తమ దశ. అందుకే దీనితో మీరు గర్వపడకండి అని నా సలహా. మీరు ఇంకా ఎన్నో శిఖరాగ్రానికి చేరాలని ఆశిస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చాడు. దీనికి డైరెక్టర్ శంకర్ స్పందిస్తూ.. నా హృదయం ఆనందం, కృతజ్ఞతతో నిండిపోయింది సార్. నేను ఎప్పటికీ నా బెస్ట్ వర్క్ ఇవ్వడం ఆపను. మీ పర్ఫార్మెన్స్, ప్రెజెన్స్ కావాల్సిన ప్రత్యేకతలను తీసుకువచ్చిందని చెప్పక్కర్లేదు. ఈ ప్రత్యేక క్షణాన్ని గుర్తు చేసుకోవడానికి టోకెన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తాను’’ అంటూ రిప్లై ఇచ్చాడు.
Read More: రీమేక్ సినిమా చేయని ఏకైక టాలీవుడ్ హీరో అతనే!
My heart is filled with gratitude and joy sir.I will never stop giving it my best! And needless to say, your performance and presence brought an essential essence to the film. Thank you for the token to commemorate this very special moment. I will cherish this feeling 🙏… https://t.co/mN9WFuC4No
— Shankar Shanmugham (@shankarshanmugh) June 28, 2023