‘Baby’ హీరోయిన్‌ను కలిసిన డైరెక్టర్ Harish Shankar.. Pawan సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్టేనా!

by Hamsa |
‘Baby’ హీరోయిన్‌ను కలిసిన డైరెక్టర్ Harish Shankar.. Pawan సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్టేనా!
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి వైష్ణవి చైతన్య ‘బేబీ’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. మొదటి చిత్రంతోనే పెద్ద హిట్ అందుకుని ఫుల్ క్రేజ్ తన సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆమె కోసం దర్శక , నిర్మాతలు పోటీ పడుతున్నారు. మొదటి సినిమాలోనే బోల్డ్ రోల్‌లో నటించి పెద్ద సాహసం చేసిందని అభిప్రాయపడుతున్నారు.

తాజాగా, వైష్ణవి చైతన్యను గబ్బర్ సింగ్ షేమ్ హరీష్ శంకర్ కలిశారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఆయన ఓ స్పెషల్ ట్వీట్ కూడా చేశారు. ‘‘టాలెంటెడ్ గర్ల్ వైష్ణవిని కలిశాను. ఆమెను కలవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని’’ రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు ఆయన మాటలు వింటుంటే పవన్ కల్యాణ్‌తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఛాన్స్ ఇచ్చినట్టే అని కామెంట్లు చేస్తున్నారు. కాగా, సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన బేబీ మూవీ లో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా జులై 14 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సాధించింది. కేవలం హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాదు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

Also Read: బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతున్న Bro కలెక్షన్లు.. విశ్లేషకుల అంచనా!

Advertisement

Next Story

Most Viewed