‘దోచేవారెవరురా’ బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా: హరీష్ శంకర్

by Vinod kumar |
‘దోచేవారెవరురా’ బిగ్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా: హరీష్ శంకర్
X

దిశ, సినిమా: IQ క్రియేషన్స్ బ్యానర్‌పై బొడ్డు కోటేశ్వరరావు నిర్మాణంలో శివ నాగేశ్వరావు తెరకెక్కించిన కామెడీ థ్రిల్లర్ ‘దోచేవారెవరురా’. ప్రణవచంద్ర, మాళవిక సతీషన్, అజయ్ గోష్, బిత్తిరి సత్తి, మాస్టర్ చక్రి, జెమిని సురేష్ కీలకపాత్రలు కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బెనర్జీ అతిధి పాత్రల్లో నటించిన సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసిన దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘మంచి కథతో వస్తున్న సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి.

ఇందులో నటించిన నటీనటులు, టెక్నిషియన్స్‌, నిర్మాతలకు ఆల్ ది బెస్ట్. మూవీ బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అన్నాడు. అలాగే తమ సినిమా ట్రైలర్‌ విడుదలచేసిన హరీష్ శంకర్‌తోపాటు కార్యక్రమానికి వచ్చిన ఉత్తేజ్, ప్రణీత్, హర్ష వర్ధన్‌లకు థాంక్స్ చెప్పిన దర్శకనిర్మాతలు కుటుంబ సామెతంగా చూడదగ్గ సినిమా ప్రేక్షకులందరికీ నచ్చుతుందన్నారు.

Advertisement

Next Story