బాలయ్య వీడియోతో పోలీసులకు గట్టి కౌంటర్ ఇచ్చిన డింపుల్ హయాతి.. ట్వీట్ వైరల్

by Hamsa |   ( Updated:2023-05-28 07:08:05.0  )
బాలయ్య వీడియోతో పోలీసులకు గట్టి కౌంటర్ ఇచ్చిన డింపుల్ హయాతి.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ డింపుల్ హయాతీ ‘ఖిలాడీ’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ‘రామబాణం’ చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ఇటీవల ట్రాఫిక్ పోలీస్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును ఢీ కొట్టి ధ్వంసం చేసి వార్తల్లో నిలిచింది. ఈ ఘటనలో ఆమెపై క్రిమినల్ కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డింపుల్ హయాతీ డీసీపీ డ్రైవర్ చేతన్‌పై ఫిర్యాదు చేసింది. అయితే జూబ్లీహిల్స్ పోలీసులు ఈ ఫిర్యాదును తీసుకోలేదు. దీంతో ఈ అమ్మడు సోషల్ మీడియా వేదికగా పోలీసులపై పలు పోస్టులు షేర్ చేస్తుంది. తాజాగా, బాలయ్య వీడియోతో మరోసారి పోలీసులకు గట్టి కౌంటర్ ఇచ్చింది. సింహా సినిమాలోని బాలయ్య పోలీసులకు పవర్ ఫుల్ వార్నింగ్ ఇచ్చే సీన్‌ వీడియోను షేర్ చేసింది. అంతేకాకుండా దానికి ఫైర్ ఎమోజీని కూడా జత చేసింది. దీంతో అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read: రామ్ చరణ్ నిర్మాతగా ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అప్డేట్

Advertisement

Next Story