8 ఏళ్ళ వయస్సులోనే కష్టాలు.. ఇండస్ట్రీలో ఎంతోమంది నన్ను అలా చేశారు.. సలార్ నటి సెన్సేషనల్ కామెంట్స్!

by Kavitha |
8 ఏళ్ళ వయస్సులోనే కష్టాలు.. ఇండస్ట్రీలో ఎంతోమంది నన్ను అలా చేశారు.. సలార్ నటి సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి నేడు పాన్ ఇండియా సినిమాల్లో నటించే స్థాయికి వచ్చిన యాంకర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె తనకి 8 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడే రేడియో ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పెద్దయ్యాక యాంకర్‌గా మారి ఎన్నో సూపర్ హిట్ ప్రోగ్రామ్స్ చేసింది. ఇప్పుడంటే మనం సుమ, శ్రీముఖి వంటి యాంకర్స్‌ని రోజు టీవీలలో చూస్తున్నాం కానీ, ఆ రోజుల్లో ఏ టీవీ పెట్టినా మనకి ఝాన్సీ మాత్రమే కనిపించేది అని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. అలా బుల్లితెర ద్వారా వచ్చిన క్రేజ్ కారణంగా ఈమెకు సినిమాల్లో అవకాశాలు రావడం కూడా మొదలయ్యాయి.

సాధారణంగా బుల్లితెరకు అలవాటు పడిన నటీనటులు వెండితెర మీద అంత గొప్పగా ఆడియన్స్‌ మెప్పు పొందలేరు. యాంకర్ సుమ కూడా పలు సినిమాల్లో నటించింది కానీ, సక్సెస్ కాలేకపోయింది. కానీ ఝాన్సీ మాత్రం యాంకర్‌గా ఎంత సక్సెస్ అయ్యిందో, నటిగా అంతకు మించి సక్సెస్ అయ్యింది. అందుకే ఈమెకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. పాన్ ఇండియన్ లెవెల్‌లో బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీని సృష్టించిన ‘సలార్’ వంటి క్రేజీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంలో కూడా ఝాన్సీ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించింది. ఇదంతా పక్కన పెడితే ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో తాను ఎలాంటి కష్టాలను ఎదుర్కోవలసి వచ్చిందో రీసెంట్‌గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది ఝాన్సీ.

ఆమె మాట్లాడుతూ ‘ఇప్పటి లాగా అప్పట్లో 40 , 50 టీవీ చానల్స్ ఉండేది కాదు. కేవలం రెండు టీవీ చానల్స్ మాత్రమే ఉండేది. ఆ రెండు చానల్స్ కోసం నలుగురు యాంకర్స్ పోటీ పడేవారు. నా కెరీర్‌ని మలుపు తిప్పిన షో ఏదైనా ఉందా అంటే, అది ‘టాక్ ఆఫ్ ది టౌన్’ షో అని చెప్పగలను. ఈ ప్రోగ్రాం పెద్ద హిట్ అవ్వడంతో నాకు అవకాశాలు క్యూ కట్టాయి. అదే సమయంలో ఇండస్ట్రీలో నన్ను తొక్కేవారు కూడా ఎక్కువయ్యారు. కెరీర్ ప్రారంభంలో అందరి లాగానే నేను కూడా తప్పులు, పొరపాట్లు చేశాను కానీ, వాటిని సరిదిద్దుకుంటూ నేడు ఈ స్థాయికి చేరుకున్నాను. చాలామంది డైరెక్టర్స్‌కి నేను నచ్చేదానిని కాదు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్‌ని ఇచ్చినట్టు చదవాలి. కానీ నాకేమో ఏదైనా బాగాలేదు అనిపిస్తే స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేయించడం అలవాటు. అది కొంతమంది డైరెక్టర్స్‌కి నచ్చేది కాదు. నాకు వచ్చే అవకాశాలకు కూడా గండికొట్టేవారు. కొన్ని ఈవెంట్స్ నా వల్ల గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. కానీ నేను లేకుండా సంబరాలు చేసుకునేవారు, అలా నన్ను ఇండస్ట్రీలో చాలామంది వాడుకొని వదిలేశారు’ అంటూ చెప్పుకొచ్చింది ఝాన్సీ.

Next Story

Most Viewed