ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేనంటూ స్టార్ హీరోయిన్ ఎమోషనల్(వీడియో)

by Hamsa |   ( Updated:2024-08-26 14:06:08.0  )
ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేనంటూ స్టార్ హీరోయిన్ ఎమోషనల్(వీడియో)
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సిమ్రాన్ ఒకప్పుడు అగ్ర హీరోలందరితో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే తెలుగు, తమిళం, కన్నడ, భాషల్లో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా తెలుగులో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరో పక్కన గ్లామర్ రోల్ చేసి లేడీ సూపర్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటుంది.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిమ్రాన్ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘ 2001లో మా చెల్లి సూసైడ్ చేసుకుందన్న వార్త చూసి షాకయ్యాను. అప్పుడే మా జీవితంలో చాలా కష్టమైన రోజులు. ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేము. కానీ నిజం ఒప్పుకోవాలి కాబట్టి తప్పదు. ఆమె లేదని గుర్తుపెట్టుకుని ముందుకు సాగిపోవాలి. ప్రేమించిన వారి కోసం ఎలా ప్రాణాలు తీసుకుంటారు. ఫ్యామిలీ గురించి ఒక్క నిమిషం ఆలోచించలేరా?’’ అని ఎమోషనల్ అయింది. ప్రజెంట్ సిమ్రాన్‌కు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. సూసైడ్ తప్పు ఒక్కసారి ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించాలి అని అంటున్నారు. అలాగే కొందరు కజిన్ సిస్టర్ లేదా ఓన్ చెల్లా అని కామెంట్లు పెడుతున్నారు.

(Video Link Credits to ssmusicofficial Instagram Channel)

Advertisement

Next Story