- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాకు, కమల్‌కు మధ్య విబేధాలు.. ఏం చేస్తారో అని భయమేస్తుందంటూ రజినీకాంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
దిశ, సినిమా: సూపర్ రజినీకాంత్ ఇటీవల జైలర్ సినిమాతో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత లాల్ సలామ్ మూవీలో కీలక పాత్రలో నటించారు. ఇక ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రజినీకాంత్ వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు పోటినిస్తున్నారు. అంతేకాకుండా రాజకీయాల్లోనూ రాణిస్తూ ఫుల్ బిజీ అయిపోయారు. ఇదిలా ఉంటే.. తాజాగా, రజినీకాంత్ చెన్నైలోని ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి గెస్ట్‌గా వెళ్లారు. ఆ తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ డాక్టర్లు ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
గతంలో ఒకసారి కావేరి హాస్పిటల్ ఎక్కడ అంటే కమల్ హాసన్ ఇంటి దగ్గర అనేవారు. కానీ ఇప్పుడు కమల్ ఇల్లు ఎక్కడ అని అడిగితే.. కావేరి ఆస్పత్రి దగ్గర అని చెప్పే అంతగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు నేను కమల్ గురించి చెప్పాను అని.. మా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని రాయకండి. నేనేదో ఉదాహరణ కోసం చెప్పాను అంతే.. అసలే మీడియా వాళ్ల ముందు మాట్లాడడానికి నేను ఆలోచిస్తాను.
ఎందుకంటే ఇది ఎలక్షన్ టైమ్ కాబట్టి నేనేం మాట్లాడినా కానీ మీడియా వారు వారి ఇష్టానికి ఏదో అనుకొని రాసేస్తున్నారు. ఈ కెమెరాలను చూస్తుంటేనే నాకు భయమేస్తుంది. నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నాను’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రజినీకాంత్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.