Guppedantha Manasu: జగతిని చంపిందెవరో.. రిషికి తెలిసిపోయిందా..?

by Prasanna |   ( Updated:2023-10-11 07:28:19.0  )
Guppedantha Manasu: జగతిని చంపిందెవరో..  రిషికి తెలిసిపోయిందా..?
X

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

ఆ రోజు మీ మీద పడిన నిందని అబద్దమని ఎస్ఐ గారికి, మినిస్టర్ గారికి చెప్పాను సార్.. వసు రిషితో అంటుంది. ‘అది అబద్దమని నీకు తెలుసు, అందరికీ తెలుసు. కానీ.. నాకు కావాల్సింది అది కాదు.. ఆ అబద్దం ఎందుకు చెప్పాల్సి వచ్చింది. మీతో ఎవరు చెప్పమన్నారు? అనేది మాత్రమే నాకు కావాలంటాడు.. రిషి. అసలు ఆ రోజు ఏమి జరిగిందో? మొత్తం వాళ్లకు చెప్పాను సార్’ అంటుంది వసు. శైలేంద్ర, దేవయానీలు.. ఒక్కసారిగా షాక్ అయి ‘ఏంటీ.. చెప్పావా? మొత్తం చెప్పావా? అసలు వాళ్లకి ఏమని చెప్పావ్?’ అని దేవయాని వసుని అడుగుతుంది. ‘అవును మేడమ్.. చెప్పాను. కానీ మీరెందుకు అంత కంగారు పడుతున్నారు?’ వసు అంటుంది. దాంతో రిషి, ఫణేంద్ర ఇద్దరూ.. వాళ్ల వైపు అనుమానంగా చూస్తారు.

వసు మాటలకు.. అడగాలని అడిగాను.. అంతే కంగారు ఏం లేదు అని దేవయాని కవర్ చేసుకుంటుంది. ఆ రోజు నాకు ఆ చెక్ రిషి సారే సారధికి ఇచ్చారని అబద్దం చెప్పమన్నది జగతి మేడమ్ సార్ అంటుంది వసు. రిషీ షాక్ అయ్యి పైకి చేసి.. వసువైపు చూస్తూ.. ‘నీకు మా అమ్మ చెప్పిందా?’ అని అడుగుతాడు. ‘అవును సార్.. కానీ మేడమ్ అలా చెప్పడానికి చాలా పెద్ద కారణం ఉంది సార్.. రిషి ప్రాణాలు కాపాడుకోవాలంటే నేను చెప్పినట్లు చెయ్ అన్నారు అని జగతి మేడమ్ అన్నారు సార్ అని వసు అంటుంది.

Advertisement

Next Story