Prabhas-Anushka :ప్రభాస్-అనుష్కల పెళ్లి కృష్ణంరాజే అడ్డుకున్నాడా..?

by Hamsa |   ( Updated:2023-05-26 10:39:25.0  )
Prabhas-Anushka :ప్రభాస్-అనుష్కల పెళ్లి కృష్ణంరాజే అడ్డుకున్నాడా..?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, హీరోయిన్ అనుష్క మధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి బిల్లా, మిర్చి, బాహుబలి చిత్రాల్లో కలిసి నటించారు. ఈ క్రమంలో వాళ్ళు ప్రేమించుకున్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో పలు వార్తలు హల్ చల్ చేశాయి. ఈ వార్తలపై ప్రభాస్ చాలాసార్లు స్పందిస్తూ.. మా ఇద్దరి మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అని కొట్టిపారేశారు. అనుష్క ఓ టీవీ షోలో పాల్గొని సినిమాలైనా వదులుకుంటాను కానీ, ప్రభాస్‌తో ఫ్రెండ్‌షిప్ వదులుకోనని చెప్పుకొచ్చింది.

దీంతో అది తెలుసుకున్న ఫ్యాన్స్ స్వీటీ ప్రభాస్‌ను ఇష్టపడుతుందని అనుకున్నారు. అయితే ప్రభాస్, అనుష్క పెళ్లి చేసుకోవడం కృష్ణంరాజుకు ఇష్టం లేదని ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ఈ మధ్యనే ఆయన మృతి చెందిన సంగతి తెలిసిందే. గతంలో కృష్ణంరాజు అనుష్కను మాత్రం కోడలుగా వద్దనుకుని వారి పేర్ల మీద ప్రత్యేక పూజలు చేయించారట. అనుష్క జాతకంలో కుజ దోషం ఉండటంతో పాటు ప్రభాస్ జాతకానికి మ్యాచ్ కాలేదట. అందుకే వారు పెళ్లి చేయకూడదని కృష్ణంరాజు గట్టిగా ఫిక్స్ అయ్యాడట. ఈ నేపథ్యంలో డార్లింగ్ అనుష్కను మాత్రమే పెళ్లి చేసుకుంటానని పెదనాన్నకు చెప్పేశాడట. అందుకే ఆయన బతికి ఉన్నంతవరకు ప్రభాస్ తన పెళ్లి గురించి టాపిక్ తీయలేదు అని తెలుస్తుంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే ప్రభాస్ స్పందించే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లోకి చొరబడ్డ జంట..!

Advertisement

Next Story