- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Aishwarya-Abhishek: ఆ హీరోయిన్ కారణంగా విడాకులు తీసుకున్నారా.. బయటపడ్డ సంచలన నిజం? (వీడియో)
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే గత కొద్ది కాలంగా ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. వీటిపై వీరిద్దరు స్పందించలేదు. అయితే ఇటీవల అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట జరిగిన అనంత్ అంబానీ పెళ్లికి ఐశ్వర్య తన కూతురుతో హాజరు కావడంతో విడాకుల వార్తలు మరోసారి జోరందుకున్నాయి. అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీకి దూరంగా ఉండటంతో అభిషేక్, ఐశ్వర్య విడాకుల వార్తలు ఎక్కువయ్యాయి.
ఈ క్రమంలో.. అభిషేక్ బచ్చన్ హీనాకంద్వాల్ పెట్టిన విడాకుల పోస్ట్‌కు లైక్ చేయడంతో విడాకుల వార్తలకు బలం చేకూరినట్లు అయింది. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నారనే ప్రచారం మొదలైపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఐశ్వర్య, అభిషేక్ విడిపోవడానికి కారణం ఓ హీరోయిన్ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సీనియర్ నటి రేఖ అమితాబ్ ఇంట విభేదాలకు కారణం అని నెటిజన్లు అంటున్నారు.
మరీ ముఖ్యంగా ఇటీవల జరిగిన అనంత్ అంబానీ పెళ్లి లో రేఖతో ఐశ్వర్య చాలా క్లోజ్‌గా కనిపించిన వీడియో వైరల్ కావడంతో అంతా నిజమేనని అంటున్నారు. ఈ వేడుకల్లో ఐశ్వర్య, రేఖ గుసగుసలాడుకోవడంతో సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అంబాని ఇంట వీరిద్దరు కలుసుకున్న వీడియోని ఆధారంగా చేసుకుని ఐశ్వర్య, అభిషేక్ విడిపోవడానికి రేఖనే కారణమని నెట్టింట పలు చర్చలు మొదలయ్యాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ వీరిద్దరి విడాకుల వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
(Video Link Credits To Viral Bayani Instagram Channel)