Patriotic Dialogues: దేశభక్తిని చాటి చెప్పిన అగ్ర హీరోల డైలాగ్స్.. వింటే గూస్‎బంప్స్ రావాల్సిందే

by Anjali |   ( Updated:2024-08-15 15:51:12.0  )
Patriotic Dialogues: దేశభక్తిని చాటి చెప్పిన అగ్ర హీరోల డైలాగ్స్.. వింటే గూస్‎బంప్స్ రావాల్సిందే
X

దిశ, సినిమా: ‘‘బానిస బతుకులకు విముక్తి చెబుతూ.. అమర వీరుల త్యాగాలను గౌరవిస్తూ ప్రతి ఏటా ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటారు. నేటి మన స్వాతంత్య్ర సంబరం ఎందరో త్యాగవీరుల త్యాగఫలం, సమర యోధుల పోరాట బలం, అమర వీరుల త్యాగఫలం, బ్రిటీష్ పాలకులపై తిరుగులేని విజయం నేడు మనం జరుపుకునే స్వాతంత్య్ర దినోత్సవం’’. అయితే నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తిని చాటిచెప్పే కొన్ని డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

అల్లూరి సీతారామరాజు -కృష్ణ (ఒక్క సీతారామరాజు చనిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. ఒక్కొక్కడు ఒక్కో విప్లవ వీరుడై విజృభించి బ్రిటీషు సామ్రాజ్యపు పునాదులు పెళ్లగిస్తాడు. సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సమూహ శక్తి, సంగ్రామ భేరి).

సైరా నరసింహారెడ్డి -మెగాస్టార్ చిరంజీవి: (స్వేచ్చా కోసం ప్రజలు చేస్తున్న తిరిగుబాటు నా భరతమాత గడ్డమీద నిలబడి హెచ్చరిస్తున్న, నాదేశం వదిలి వెళ్ళిపోండి లేదా యుద్దమే).

వీరపాండియ కట్టబొమ్మన్ - ఎన్టీఆర్ (ఒరేయ్ ఎందుకు కట్టాలి రా శిస్తు.. నారు పోసావా నీరు పెట్టావా.. కోత కొసావా కుప్ప నూర్చవా.. ఒరేయ్ తెల్ల కుక్కా కష్ట జీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు సిస్తేన్దుకు కట్టాలిరా).

సుభాష్ చంద్రబోస్‎- వెంకటేష్:( దేశం కోసం ప్రాణాలిచ్చిన అల్లూరి, భగత్‌సింగ్‌లను తెల్లదొరలు చంపారు. నన్ను చంపితే సాటి భారతీయుడిని చంపిన మొదటి జాతి ద్రోహివి నువ్వే అవుతావ్‌. చంపరా చంపు).

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా-అల్లు అర్జున్(సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఈస్ట్, వెస్ట్ అన్నీ ఇండియా లు లేవు రా మనకు ఒక్కటే భారతదేశం. అబ్ భోల్ రహుం. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా).

ఆర్ఆర్ఆర్- జూనియర్ ఎన్టీఆర్(తొంగి తొంగి నక్కి నక్కి కాదే తొక్కుకుంటూ పోవాలే. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి)

ఆర్ఆర్ఆర్- రామ్ చరణ్: (నువ్వు చేసేది ధర్మయుద్ధమైతే ఆ యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి). ఈ హీరోలు చెప్పిన డైలాగులు ప్రస్తుతం నెట్టింట జనాలకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed