ధనుష్ 'సార్' సినిమా ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే?

by Hamsa |
ధనుష్ సార్ సినిమా ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో ధనుష్ మొట్టమొదటి సారి తెలుగులో చేస్తున్న సినిమా 'సార్'. డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ మూవీలో.. సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ (17) గ్రాండ్‌గా విడుదలై మొదటి షోతోనే పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. సినిమాను చూసిన అభిమానులు ట్విట్టర్ వేదికగా తమ రెస్పాన్స్‌ను తెలియజేస్తున్నారు. ప్రస్తుత సమాజంలో విద్యావ్యవస్థ ఎలా వ్యాపారంగా మారింది? చదువును అడ్డుపెట్టుకుని ప్రజల బలహీనతతో ఆడుకుంటూ.. కొంతమంది ఎలా కోట్లు సంపాదిస్తున్నారు? అనే విషయాలను వెంకీ అట్లూరీ చాలా చక్కగా చూపించినట్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మధ్య తరగతి బాధలను చక్కగా వివరించారు. కొన్ని సీన్లు బోరింగ్.. ఫస్టాప్ కాస్త స్లోగా ఉన్నప్పటికీ.. ధనుష్ యాక్టింగ్, డైలాగ్స్.. జీవి ప్రకాష్ మ్యూజిక్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. కాగా ఈ సినిమాకు రేటింగ్ 2.5/5 ప్రేక్షకులు ఇస్తున్నారు.


Advertisement

Next Story

Most Viewed